May 20,2023 13:20

ఆస్ట్రేలియాతో వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే జస్ప్రీత్‌ బుమ్రా, రిషబ్‌ పంత్‌, కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ గాయాల కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం కాగా.. తాజాగా అశ్విన్‌ కూడా గాయం బారిన పడడం భారత జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. అశ్విన్‌ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. నిన్న పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన రాజస్తాన్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని టాస్‌ సమయంలో రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ తెలిపాడు. అశ్విన్‌ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని, అందుకే ఆఖరి నిమిషంలో తమ జట్టులో మార్పు చేశామని శాంసన్‌ వెల్లడించాడు. తాజాగా అశ్విన్‌ కూడా గాయం బారిన పడడం భారత జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.

భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్యా రహానే, ఇషాన్‌ కిషన్‌, కెఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మొహమ్మద్‌. షమీ, మొహమ్మద్‌. సిరాజ్‌, ఉమేష్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కట్‌.