నాగ్‌పూర్ : టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 18 ఏళ్ల కుంబ్లే రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. టెస్టుల్లో 450 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో అలెక్స్ క్యారీని ఔట్ చేసిన అశ్విన్.. ఈ ఘనత సాధించాడు. ఇక 450 టెస్టు వికెట్లు పడగొట్టిన అశ్విన్ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. 89 టెస్టు మ్యాచ్‌లోనే అశ్విన్ అత్యంత వేగంగా 450 వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు.
2005లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో కుంబ్లే తన 450వ వికెట్‌ను పడగొట్టాడు. ఇక తాజా మ్యాచ్‌తో 18 ఏళ్ల కుంబ్లే రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. తొలి స్థానంలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్(80 మ్యాచ్‌లు) ఉన్నాడు.










