Jun 14,2023 21:30

జకార్తా : ఇండోనేషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి లక్ష్యసేన్‌, కిదాంబి శ్రీకాంత్‌ ప్రవేశించాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో లక్ష్యసేన్‌ 21-17, 21-13తో అమెరికాకు చెందిన 8వ సీడ్‌ లీ-జి-జియావోపై, కిదాంబి శ్రీకాంత్‌ 21-13, 21-19తో చైనాకు చెందిన లూ-జంగ్‌-జూ(చైనా)పై వరుససెట్లలో గెలిచారు. ఇక మహిళల సింగిల్స్‌లో ఆకర్షీ కశ్యప్‌ 10-21, 4-21తో 2వ సీడ్‌ కొరియాకు చెందిన అన్‌-సే-యంగ్‌ చేతిలో చిత్తుగా ఓడగా.. మరో పోటీలో ప్రియాంశు రాజ్‌వత్‌కు తొలిరౌండ్‌లో వాకోవర్‌ లభించింది. ప్రత్యర్ధి 3వ సీడ్‌ విదిత్‌శరణ్‌(థాయ్ లాండ్‌) తొలి మ్యాచ్‌ ఆడకుండా వైదొలిగాడు. దీంతో ప్రియాంశు ప్రి క్వార్టర్స్‌కు చేరిన సంగతి తెలిసిందే.