Jun 26,2023 21:11
  • రెండో యూరోపియన్‌ టూర్‌ టైటిల్‌ కైవసం

ఛెచియా(చెక్‌ రిపబ్లిక్‌): భారత స్టార్‌ మహిళా గోల్ఫర్‌ దీక్షా దగర్‌ రికార్డు నెలకొల్పింది. కెరీర్‌లో రెండో యూరోపియన్‌ టూర్‌ టైటిల్‌ను కైవసం చేసుకొని దీక్షా ఈ రికార్డును సాధించింది. చెక్‌ రిపబ్లిక్‌లో జరుగుతున్న మహిళల టిప్‌ స్పోర్ట్స్‌లో ఆదివారం జరిగిన పోటీల్లో దీక్ష మరో నాలుగు షాట్స్‌ మిగిలి ఉండగానే విజేతగా నిలిచింది. 22 ఏళ్ల దీక్ష తొలిసారి 2019లో లండన్‌ వేదికగా జరిగిన ఎలిట్‌ టైటిల్‌ను ముద్దాడింది. ఆ తర్వాత 2021లో లండన్‌ వేదికగా జరిగిన అరమ్‌ కో టీమ్‌ సీరిస్‌లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యురాలు కూడాను. ఎల్‌ఇటిలో దీక్ష 79తో ప్రారంభించి తొమ్మిది టాప్‌-10 ముగింపులను కలిగి అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇక హర్యానాకు చెందిన ఝజ్జర్‌కు ఐదు షాట్ల ఆధిక్యతతో ప్రారంభించిన విజేతగా నిలవడంలో విఫలమైంది.

2