న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత వృద్థి రేటు 6.1 నుంచి 6.3 శాతానికి పరిమితం కావొచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అంచనా వేసింది. 2022-23లో స్థూలంగా 7 శాతానికి అటూ, ఇటుగా ఉండొచ్చని ఆర్‌బిఐ తన నెలసరి బులిటెన్‌లో పేర్కొంది. ఈ నెల చివరిలో ఎన్‌ఎస్‌ఒ జిడిపి గణంకాలను అధికారికంగా విడుదల చేయనుంది. విదేశీ ప్రతికూల పరిణామాలకు తోడు దేశీయంగా హెచ్చు ద్రవ్యోల్బణం జిడిపిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది.










