కోల్‌కతా: త్వరలో జరగనున్న పురుషుల బాక్సింగ్ ప్రపంచకప్ ఛాంపియన్‌షిప్‌కు 13మందితో ఆటగాళ్లతో కూడిన బృందాన్ని పంపనున్నట్లు ఇండియా బాక్సింగ్ అసోసియేషన్(ఐబిఏ) శనివారం వెల్లడించింది. స్టార్ బాక్సర్లు శివ థాపా, దీపక్ భోరియా, మహ్మద్ హుసాముద్దీన్‌లతో కూడిన జట్టును ప్రకటించింది. వీరంతా ఈనెల 17నుంచి జరిగే ప్రాక్టీస్‌కు హాజరుకానున్నారు. ఇక బాక్సింగ్ ప్రపంచకప్ టోర్నీ ఈనెల 30నుంచి మే 14వరకు ఉజ్బెకిస్తాన్‌లోని తస్కెంట్ వేదికగా జరగనుంది. ఆసియా ఛాంపియన్‌షిప్ పతక విజేత శివ థాపా(63.5కిలోలు), రెండుసార్లు కామన్వెల్త్ క్రీడల కాంస్య పతక విజేత మహ్మద్ హుసాముద్దీన్(57కిలోలు), ఆసియా క్రీడల కాంస్య పతక విజేత దీపక్ భోరియా(51కిలోలు) విభాగంలో బరిలోకి దిగనున్నారు.
1. గోవింద్ సహాని : 48కిలోలు
2. దీపక్ భోరియా : 51 ,,
3. సచిన్ సివాచ్(జూ) : 54 ,,
4. హుసాముద్దీన్ : 57 ,,
5. వారిందర్ సింగ్ : 60 ,,
6. శివ థాపా : 63.5 ,,
7. ఆకాశ్ సంఘ్వాన్ : 67 ,,
8. నిషాంత్ దేవ్ : 71 ,,
9. సుమిత్ కుందు : 75 ,,
10. ఆశీశ్ చౌదరి : 80 ,,
11. హర్ష్ చౌదరి : 86 ,,
12. నవీన్ కుమార్ : 92 ,,
13. నరేందర్ బేర్వాల్ : 92+ ,,










