Jun 29,2023 22:18

ఐదేండ్లలో తొలిసారి వందలో..
న్యూఢిల్లీ : భారత ఫుట్‌బాల్‌ జట్టు ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఎగబాకింది. గత ఐదేండ్లలో తొలిసారి టాప్‌ా100లోకి అడుగుపెట్టింది. గత ఏడాది ఇదే సమయంలో 104వ స్థానంలో నిలిచిన భారత్‌.. తాజాగా వరుసగా రెండు ఏఫ్‌ఏ టోర్నీలో ఆడేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఫిఫా తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్‌ జట్టు (మెన్స్‌) 100వ స్థానంలో నిలిచింది. లెబనాన్‌, న్యూజిలాండ్‌లను వెనక్కి నెట్టిన టీమ్‌ ఇండియా..ఐదేండ్లలో అత్యుత్తమ ర్యాంక్‌ సాధించింది. ఫిఫా ప్రపంచకప్‌ చాంపియన్‌ అర్జెంటీనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఫ్రాన్స్‌, బ్రెజిల్‌, ఇంగ్లాండ్‌, బెల్జియం, క్రోయేషియా, నెదర్లాండ్స్‌, ఇటలీ, పోర్చుగల్‌, స్పెయిన్‌ టాప్‌ా10లో కొనసాగుతున్నాయి.