Feb 15,2023 12:43
  •  గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానం..

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు బుధవారం వెస్టిండీస్‌తో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజయంతో శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ జట్టు పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు ఒపెనర్‌ స్మతి మంధాన గాయంతో అందుబాటులో లేకపోయినా... లక్ష్యఛేదనలో భారత్‌ ఆడిన తీరు బాగుంది. వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు స్టార్‌ ఓపెనర్‌ స్మతి తుది జట్టులోకి రానుంది. ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ, వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసి వచ్చే అంశం. కాగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడిన విండీస్‌ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. లేకుంటే వారి నాకౌట్‌ అవకాశాలు దాదాపుగా దూరమవుతాయి.
టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవెన్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌), యస్తికా బాటియా, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్‌, హర్లిన్‌ డియోల్‌, రిచా ఘోష్‌, పూజా వస్త్రాకర్‌, దీప్తి శర్మ, రేణుకా సింగ్‌, రాధా యాదవ్‌, శిఖా పాండే