భట్టిప్రోలు (బాపట్ల) : భట్టిప్రోలు జగనన్న కాలనీలో శనివారం సిపిఎం నేతలు పర్యటించారు. కాలనీలోని లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి, బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు టి.కృష్ణమోహన్, స్థానిక నాయకులు ఎం.సత్యనారాయణ, బోరుగడ్డ సుబ్బారావు, బట్టు నాగమల్లేశ్వరరావు, తదితరులు ఉన్నారు. కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని, సరైన రహదారులు కాని, మెరకలు కాని లేకపోవటం వలన ప్రభుత్వం అందించే యూనిట్ కాస్టు సరిపోక లబ్ధిదారులకు అదనంగా మరో మూడు నుండి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని నేతలు తెలిపారు. అక్కడ నిరుపేదలుగా ఉన్న లబ్ధిదారులు అప్పులు చేసి ఇండ్లను నిర్మించుకున్నప్పటికీ రహదారి మార్గాలు లేక గృహప్రవేశాలు కూడా చేయలేకపోతున్నారని రమాదేవి ఆందోళన వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు యూనిట్ కాస్ట్ ను పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు.