Nov 26,2022 21:32

ముంబయి : యూనియన్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌ను విడుదల చేస్తున్నట్లు యూనియన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఎఎంసి) వెల్లడించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకమని పేర్కొంది. ఇందులో వచ్చిన నిధులను మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ వ్యాప్తంగా క్రమశిక్షణతో ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా క్యాపిటల్‌ వఅద్ధి చేయడం లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ అందించే అత్యధిక వఅద్ధి సామర్ధ్యంతో ఈ స్కీమ్‌ ప్రయోజనం పొందుతుదని పేర్కొంది. ఈ ఫండ్‌ నవంబర్‌ 28న తెరుబడుతుందని.. డిసెంబర్‌ 12 మూసివేయబడుతుందని తెలిపింది.