Dec 20,2022 21:58

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి:మూడో త్రైమాసికంలోనూ ఓవర్‌డ్రాఫ్ట్‌ భారం పెరుగుతోంది. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ 17వ తేదీ వరకు 26 రోజులపాటు ఓడిలపైనే ఆధారపడాల్సివచ్చింది. డిసెరబర్‌లోనే 15 రోజులపాటు రాష్ట్ర ఖజానా ఓవర్‌డ్రాఫ్ట్‌లో ఉన్నట్లు తేలింది. ఈ నెల్లో తొలి ఎనిమిది రోజులు వరుసగా ఓడీలోనే   ఉండగా, తరువాత ఇప్పుడు మళ్లీ ఆరు రోజులు ఓడిలో ఉంది. రిజర్వ్‌బ్యాంకు నుంచి  తీసుకునే బహిరంగ మార్కెట్‌ రుణాలపై ఉన్న ఆంక్షల కారణంగా ఈ నెల్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రునం రాలేదు. అరదుకే ఎక్కువగా ఓవర్‌డ్రాఫ్ట్‌లతోనే ఖజానాను నెట్టుకు వస్తున్నారు. దీనివల్ల ఖజానాకు పెను భారం కావడంతో పాటు రిజర్వ్‌బ్యాంకు వద్ద పరపతి సన్నగిల్లుతుందని అధికారులు ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు.