బెంగళూరు : వచ్చే 2030 నాటికి విద్యుత్ వాహనాలు (ఇవి) దేశంలో డీజిల్, పెట్రోల్ వాహనాలను అధిగమిస్తాయని యుగౌ ఇవి ఓ రిపోర్టులో అంచనా వేసింది. వచ్చే ఎనిమిదేళ్లలో చమురు ఇంధన కార్ల సంఖ్యను ఎలక్ట్రిక్ వాహనాలు అధిగమిస్తాయని 66 శాతం మంది అభిప్రాయపడ్డారని తెలిపింది. 57 శాతానికి పైచిలుకు వినియోగదారులు ఈ రంగం వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారని పేర్కొంది. పర్యావరణానికి హాని చేయని వాహనాలను వాడాలని యోచిస్తున్నామని 56 శాతం మంది తమ 'టెక్నాలజీ-ఫస్ట్ అకో - యుగౌ ఇండియా'' విడుదల చేసిన రిపోర్టులో తేలినట్లు పేర్కొంది. కాగా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు విద్యుత్తు వాహనాలకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేవని 60 శాతం మంది పేర్కొనడం గమనార్హం.










