Oct 22,2022 21:15

హైదరాబాద్‌ : ఐటిసి లిమిటెడ్‌లో భాగమైన దేశీయ లగ్జరీ చాక్లెట్‌ బ్రాండ్‌ ఫెబెల్లి ఫైనెస్‌ కొత్తగా ఫెబెల్లి ఎక్స్‌క్విజిట్‌ చాకెట్లను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మ రేణువులతో కూడినదని పేర్కొంది. ప్రతీ బైట్‌లోనూ ఇది నోరూరిస్తుందని తెలిపింది. దేశీయ ఆర్‌అండ్‌డి తోడ్పాటుతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చి పెట్టే విధంగా ఈ చాకెట్లను రూపొందించామని ఆ కంపెనీ తెలిపింది. ప్రపంచంలో ఇంత సూక్ష్మ రేణువులతో ఏ కంపెనీ చాక్లెట్లను తయారు చేయడం లేదని సవాల్‌ చేసింది.