Mar 22,2023 16:28

ఐసీసీ తాజాగా ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వన్డేల్లో తన నెం1 ర్యాంక్‌ను కోల్పోయాడు. ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ నెం1 స్థానానికి చేరుకున్నాడు. హాజిల్‌వుడ్‌ 713 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌(708 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సిరాజ్‌(702) పాయింట్లతో ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌తో కలిసి మూడో స్థానంలో ఉన్నాడు. కాగా చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో సిరాజ్‌ అద్భుతంగా రాణిస్తే.. మళ్లీ టాప్‌ ర్యాంక్‌కు చేరుకునే అవకాశం ఉంది.