న్యూఢిల్లీ : హ్యుందారు మోటార్ ఇండియా వచ్చే కొత్త ఏడాదిలో కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో అన్ని మోడళ్లపై ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాగా. ఎంత శాతం పెంచేది ఆ కంపెనీ వెల్లడించలేదు. ఇప్పటికే మారుతి సుజుకి, కియా, టాటా మోటార్స్ తదితర కంపెనీలు ధరల పెంపును ప్రకటించిన విషయం తెలిసిందే.










