Jul 04,2023 19:05

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైలు రికార్డు క్రియేట్‌ చేసింది. జూలై 3వ తేదీన అంటే సోమవారం రోజున .. మెట్రో రైలులో 5 లక్షల 10 వేల మంది ప్రయాణికులు ట్రావెల్‌ చేశారు. ఒక్క రోజే ఇంత భారీ స్థాయిలో ప్రయాణికులు నాగోల్‌ నుంచి హైటెక్‌ సిటీ, ఎల్బీ నగర్‌ నుంచి కూకట్‌పల్లి రూట్లో భారీ సంఖ్యలో ప్రయాణికులు ట్రావెల్‌ చేశారు.
ఇప్పటి వరకు హైదరాబాద్‌ మైట్రోరైలు 40 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది. 2017 నవంబర్‌ 29న ప్రారంభమైన హైదరాబాద్‌ మెట్రోలో ఇటీవల ప్రయాణికులు సంఖ్య పెరిగింది. ఆఫీసు వేళల్లో మెట్రోలో జనం రద్దీగా ఉంటున్నారు. అమీర్‌పేట్‌ జంక్షన్‌ ఉదయం, సాయంత్రం ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. సోమవారం రోజున ఉప్పల్‌, ఎల్బీనగర్‌ స్టేషన్లు కూడా ప్రయాణికులతో నిండిపోతున్నాయి.