May 05,2023 22:02

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌
తస్కెంట్‌(ఉబ్జెకిస్తాన్‌): ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ హుసాముద్దీన్‌ ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన 57కిలోల విభాగం రౌండ్‌-32లో హుసాముద్దీన్‌ 5-0పాయింట్ల తేడాతో ఛైనాకు చెందిన లూాపింగ్‌ విజయం సాధించాడు. తొలిరౌండ్‌నుంచి హుసాముద్దీన్‌ బలమైన పంచ్‌లతో ప్రత్యర్ధికి గుక్క తిప్పుకోకుండా చేశాడు. ఆదివారం జరిగే ప్రి క్వార్టర్‌ఫైనల్లో హుసాముద్దీన్‌ రష్యాకు చెందిన సవ్విన్‌ ఎడ్వర్డ్‌తో తలపడనున్నాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన హుసాముద్దీన్‌ ఈ టోర్నమెంట్‌లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్నాడు.