హరారే: ఐసిసి వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్‌లో వెస్టిండీస్ జట్టు జూలు విదిలించింది. గ్రూప్‌ాఏ రెండో లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 101 పరుగుల తేడాతో నేపాల్‌తో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 339పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఓపెనర్లు కింగ్(32), మయర్స్(1), ఛార్లెస్(0) నిరాశపరిచినా.. కెప్టెన్, వికెట్ కీపర్ హోప్(132), పూరన్(115) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్‌కు డబుల్ సెంచరీ(216పరుగులు) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నేపాల్ బౌలర్లు రాజిబన్సికి మూడు, కరణ్, గుల్సన్, లమిఛనే, దిపేంద్రకు ఒక్కో వికెట్ దక్కాయి. ఛేదనలో నేపాల్ మిడిలార్డర్ బ్యాటర్ ఆరిఫ్(63) అర్ధసెంచరీ మినహా మరో బ్యాటర్ రాణించలేదు. దీంతో నేపాల్ జట్టు 49.4ఓవర్లలో 238పరుగులకు కుప్పకూలింది. హ్డోర్‌కు మూడు, జోసెఫ్, కీమో పాల్, హొసైన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హోప్‌కు లభించగా.. విండీస్ జట్టు 24(శని)న జింబాబ్వేతో తలపడనుంది.
- నెదర్లాండ్స్ గెలుపు..
గ్రూప్‌ాఏలో నెదర్లాండ్స్ జట్టు 5 వికెట్ల తేడాతో అమెరికాను చిత్తుచేసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన అమెరికా జట్టు 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 211పరుగులు చేయగా.. ఛేదనలో నెదర్లాండ్స్ జట్టు 43.2 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 214పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్కాట్ ఎడ్వర్డ్స్‌కు లభించింది.










