Dec 16,2022 21:25

న్యూఢిల్లీ : వాహన కంపెనీలు వరుసగా ధరలు పెంచుతున్నాయి. తాజాగా హోండా ఇండియా తన కార్ల ధరలను రూ.30,000 వరకు పెంచుతున్నట్లు శుక్రవారం తెలిపింది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ కంపెనీ తెలిపింది. ముడి సరకుల ధరలు పెరగడం, కొత్త ఉద్గార ప్రమాణాల అమలు వంటి వాటితో తయారీ వ్యయాలు భారీగా పెరిగిందని హోండా కార్స్‌ ఇండియా ఉపాధ్యక్షులు కునాల్‌ బెల్‌ పేర్కొన్నారు.