హైదరాబాద్ : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా తన మధ్యస్థాయి ఎస్‌యువి ఎలివేట్‌ను హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేసింది. బుధవారం దీన్ని ఆ కంపెనీ నేషనల్ సేల్స్ హెడ్ నిఖీల్ సరీన్, ప్రొడక్ట్ హెడ్ గుర్మిత్ సింగ్, మార్కెటింగ్ జిఎం సబా ఖాన్ ఆవిష్కరించారు. ఎలివేట్ ఎక్స్‌షోరూం ధరల శ్రేణీని రూ.10,99,900-15,99,900గా నిర్ణయించింది.










