భువనేశ్వర్: హాకీ ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్లోకి జర్మనీ, కొరియా జట్లు ప్రవేశించాయి. సోమవారం జరిగిన ఆఖరి క్రాస్ ఓవర్ మ్యాచుల్లో జర్మనీ 5-1గోల్స్ తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించగా.. చివరి మ్యాచ్‌లో కొరియా జట్టు ఏకంగా అర్జెంటీనాను ఓడించి పెను సంచలనానికి తెరలేపింది. మ్యాచ్ పూర్తయ్యే సమయానికి ఇరుజట్లు 5-5గోల్స్‌తో సమంగా నిలువగా.. పెనాల్టీ షూటౌట్‌లో కొరియా జట్టు 3-2గోల్స్ తేడాతో అర్జెంటీనాకు చెక్ పెట్టింది. లీగ్ దశలో బెల్జియం, జర్మనీ జట్ల చేతిలో ఓడిన కొరియా జపాన్‌పై గెలిచి గ్రూప్-బిలో మూడోస్థానంలో నిలిచి క్రాస్ ఓవర్‌కు చేరింది. క్రాస్ ఓవర్‌లో ఏకంగా అర్జెంటీనాపై గెలిచి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక జర్మనీ జట్టు తొలి అర్ధభాగం ముగిసే సమయానికే 4-0 ఆధిక్యతలో నిలిచింది. తొలి క్వార్టర్‌లో రెండు, రెండో క్వార్టర్‌లో మరో రెండు ఓల్స్ కొట్టిన జర్మనీ జట్టు మ్యాచ్ ముగియడానికి చివరి క్షణాల్లో ఒక గోల్ కొట్టింది. ఇక ఫ్రాన్స్ తరఫున ఏకైక గోల్‌ను గోయట్(58వ ని.)లో చేసింది.
క్వార్టర్‌ఫైనల్స్
24న : ఆస్ట్రేలియా × స్పెయిన్
బెల్జియం × న్యూజిలాండ్
25న : ఇంగ్లండ్ × జర్మనీ
నెదర్లాండ్స్ × కొరియా










