అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణ బావమరిది ఆవుల మునిశంకర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్‌ను అరెస్టు చేయబోమని కోర్టుకు తెలిపారు. 41ఏ నిబంధనలను అనుసరిస్తామని కోర్టుకు వివరించారు. దీంతో మునిశంకర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.










