Sep 01,2023 16:45

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు సునీల్‌ యాదవ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. సునీల్‌ యాదవ్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. తనను ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా ఇరికించారని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు. వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్‌ పిటిషన్‌పై అభ్యంతరం తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 8కి వాయిదా వేసింది. ఈనెల 8న సీబీఐ వాదనలు వినిపించనుంది.