అమరావతి: రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిలు ఇవ్వాలని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు.రాజధాని నగరానికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్‌రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అదే ఏడాది మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. చంద్రబాబును మొదటి నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు తరఫున వర్చువల్‌గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పూర్వాపరాలను కోర్టు దఅష్టికి తెచ్చారు. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని వివరించారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.










