Apr 07,2023 21:57

భువనేశ్వర్‌: భారత పురుషుల, మహిళల హాకీజట్టు విశ్లేషణాత్మక కోచ్‌గా హాల్కెట్‌ ఫారీ నియమించబడ్డాడు. పురుషుల జట్టు కొత్త చీఫ్‌ కోచ్‌గా క్రెయిగ్‌ ఫుల్టన్‌ ఎంపిక కాగా.. ఇతర సభ్యులుగా రెట్‌ హాల్కెట్‌, అలాన్‌ టాన్‌లు వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని హాకీ ఇండియా(హెచ్‌ఐ) శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దక్షిణాఫ్రికాకు చెందిన హాల్కెట్‌ 2010-18 మధ్యకాలంలో 155 అంతర్జాతీయ ఆడాడు. అలాగే 2022 స్కాట్లాండ్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా, అండర్‌21 జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన అనుభవముంది. ఇక మహిళల హాకీజట్టు చీఫ్‌ కోచ్‌గా కెనడాకు చెందిన ఆంథోనీ పారీ నియమింపబడ్డాడు. ఫారీ 2020లో అమెరికా మహిళల హాకీజట్టు చీఫ్‌ కోచ్‌గా ఉన్నారు. దానికి ముందు జపాన్‌ మహిళల జట్టుకు కోచ్‌గా ఉన్నారు. 2018 ఆసియా క్రీడల్లో జపాన్‌ మహిళల జట్టు భారత్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. రాబోయే ఆసియా క్రీడలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు హాకీ ఇండియా అధ్యక్షులు దిలీప్‌ టిర్కే ధన్యవాదాలు తెలిపారు.