Dec 19,2022 20:45

న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ దేశ వ్యాప్తంగా కొత్తగా 100 శాఖలను తెరిచినట్లు ప్రకటించింది. ఇటీవల 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ కొత్త శాఖలను బ్యాంకు ఆ బ్యాంక్‌ ఎండి, సిఇఒ శశిధర్‌ జగదీశన్‌ వర్చ్యూవల్‌గా ప్రారంభించారని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 425 రిటైల్‌ శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా డిసెంబర్‌ 15 నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 6,762 శాఖలకు విస్తరించినట్లయ్యిందని తెలిపింది.