ఆఫ్ఘనిస్తాన్ 331/9
బంగ్లాదేశ్‌తో రెండో వన్డే..
చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆఫ్ఘనిస్తాన్ జట్టు పట్టు బిగించింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ను ఓపెనర్లు గుర్బాజ్(145), జడ్రాన్(100) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 256పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ ఔటయ్యాక మహ్మద్ నబీ(25) మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 331పరుగుల భారీస్కోర్ నమోదు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లు ముస్తఫిజుర్, మహమూద్, షకీబ్, మిరాజ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.










