ఓస్లో: నార్వే బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ డి. గుకేశ్ సంచలనం నమోదు చేశాడు. సోమవారం జరిగిన 9వ రౌండ్ పోటీలో గుకేశ్ 97 ఎత్తుల్లో ప్రపంచ ఛాంపియన్ మాగస్ కార్ల్‌సన్‌ను ఓడించాడు. ఓటమి అనంతరం కార్ల్‌సన్.. గుకేశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో 9వ రౌండ్ పోటీ అనంతరం నోడెర్మెక్(ఉజ్బెకిస్తాన్‌ా6పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా.. కార్ల్‌సన్(నార్వే) 4.5పాయింట్లతో 7వ స్థానంలో , గుకేశ్ 2.5పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతున్నారు.










