ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. గిల్ 56 పరుగులతో రాణించగా.. డేవిడ్ మిల్లర్ 22 బంతుల్లో 46 పరుగులు, అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 42 పరుగులు రాణించారు. చివర్లో రాహుల్ తెవాటియా 5 బంతుల్లో మూడు సిక్సర్లతో 20 పరుగులు చేయడంతో గుజరాత్ స్కోరు 200 మార్క్ దాటింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పియూష్ చావ్లాకి 2 వికెట్లు దక్కగా కుమార్ కార్తీకేయ, అర్జున్ టెండూల్కర్, రిలే మెడరిత్, జాసన్ బెహ్రాడార్ఫ్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.
Miller's TITANic sixes 🤩#GTvMI #IPL2023 #JioCinema #IPLonJioCinema pic.twitter.com/BJJsmpWfGC
— JioCinema (@JioCinema) April 25, 2023
- దూకుడుగా అభినవ్, మిల్లర్.. గుజరాత్ 172/4
18 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 172 పరుగులు చేసింది. అభినవ్ మనోహర్, మిల్లర్ దూకుడుగా ఆడుతూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతానివి అభినవ్ మనోహర్ 20 బంత్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 40 పరుగులు, మిల్లర్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 34 పరుగులు చేశారు.
15 ఓవర్లు పూర్తి.. గుజరాత్ 130/4
15 ఓవరు పూర్తయ్యే సరికి గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో మిలర్ 9 బంతుల్లో 17 పరుగులు, అభినవ్ మనోహర్ 10 బంతుల్లో 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.
- విజయ్ శంకర్ ఔట్.. గుజరాత్ 103/4
పియుష్ చావ్లా బౌలింగ్‌లో 16 బంతుల్లో 19 పరుగులు చేసిన విజయ్ శంకర్ టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి అభినవ్ మనోహర్ వచ్చాడు. గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది.
- గిల్ ఔట్.. గుజరాత్ 91/3
కార్తికేయ వేసిన 12వ ఓవర్ తొలి బంతికి 57 పరుగులు చేసిన శుభ్‌మాన్‌గిల్ సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి మిల్లర్ వచ్చాడు. విజయ్ శంకర్ 15 బంతుల్లో 19 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నాడు.
- గిల్ 50
శుభ్‌మాన్ గిల్ 30 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. గిల్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. విజయ్ శంకర్ 9 బంతుల్లో 14 పరుగులతో క్రీజులో ఉన్నాడు. గుజరాత్ ప్రస్తుతానికి 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.
- పాండ్యా ఔట్.. గుజరాత్ 50/2
Hope you caught this 👌🏻 catch in our new 360° mode 😍
— JioCinema (@JioCinema) April 25, 2023
Watch the rest of #GTvMI in 360° mode 👉 LIVE on #JioCinema 📲#IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/6SAiiwvnA4
13 బంతుల్లో 13 పరుగులు చేసిన గుజరాత్ కెప్టెన్ హర్ధిక్ పాండ్యా పియుష్ చావ్లా బౌలింగ్‌లో ఔటయ్యాడు. పియుష్ చావా వేసిన 7 ఓవర్ తొలి బంతిని సూర్య కూమార్ యాదవ్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో విజయ్ శంకర్ వచ్చాడు. గుజరాత్ ప్రస్తుతానికి 50 పరుగులు చేసింది.
- పవర్ ప్లే పూర్తి
పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి గుజరాత్ 50 పరుగులు చేసింది. గిల్ 16 బంతుల్లో 31, పాండ్యా 13 బంతుల్లో 13 పరుగులు చేశారు.
- సాహా ఔట్.. గుజరాత్ 14/1
మూడో ఓవర్ తొలి బంతికి అర్జున్ టెండుల్కర్ బౌలింగ్‌లో సాహా(4) ఔటయ్యాడు. అర్జున్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన సాహా వికెట్ కిపర్ ఇషాన్ కిషాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు.
- రెండు ఒవర్లు పూర్తి..
రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ 12 పరుగులు చేసింది. సాహా 4, గిల్ 8 పరుగులు చేశారు. అర్జున్ టెండుల్కర్ ఓవర్‌లో 4 పరుగులు, జాసన్ బెహండార్ఫ్ 8 పరుగులు ఇచ్చారు.
- టాస్ గెలిచిన ముంబై..
ఐపీఎల్‌లో అహ్మదాబాద్ వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్శ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ బ్యాటింగ్ చేయనుంది.
#MumbaiIndians have opted to bowl first in Ahmedabad 🏟️
— JioCinema (@JioCinema) April 25, 2023
Watch the side collide with the Titans 💥#GTvMI #TATAIPL #IPL2023 #IPLonJioCinema | @mipaltan @gujarat_titans pic.twitter.com/AQhfp50wHo
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండూల్కర్, రిలే మెరెడిత్, పీయూష్ చావ్లా, జాసన్ బెహండార్ఫ్










