అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్ మరోసారి అదరగొట్టింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులే చేసింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (70బీ 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కైల్ మేయర్స్ (48బీ 32 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా మిగతా బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేదు. దీపక్ హుడా (11), స్టాయినిస్ (4), నికోలస్ పూరన్ (3), కఅనాల్ పాండ్య(0) ఘోరంగా విఫలమయ్యారు. ఆయుష్ బదోని (21) పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ నాలుగు, నూర్ అహ్మద్, షమి, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. వఅద్ధిమాన్ సాహా (81బీ 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (94బీ 51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసం సఅష్టించారు. హార్దిక్ పాండ్య (25బీ 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), డేవిడ్ మిల్లర్ (21బీ 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. లఖ్‌నవూ బౌలర్లలో మోV్‌ాసిన్ ఖాన్, అవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఒకానొక దశలో గుజరాత్ స్కోరు సులువుగా 250 దాటేలా కనిపించింది. చివరి ఐదు ఓవర్లలో లఖ్‌నవూ బౌలర్లు కాస్త పొదుపుగా చేయడంతో 230 లోపే పరిమితమైంది.










