కేప్‌టౌన్: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు ఘన విజయం సాధించింది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 71 పరుగులు తేడాతో గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 189పరుగుల భారీస్కోర్ చేసింది. ఓపెనర్ బెమడినె(44), బేట్స్(81నాటౌట్) తొలి వికెట్‌కు 77పరుగులు జతచేశారు. చివర్లో గ్రీన్(44నాటౌట్; 20బంతుల్లో 7ఫోర్లు) కూడా రాణించింది. ఫాతిమా ఖాతూనుకు రెండు, షోమా అక్తర్‌కు ఒక వికెట్ దక్కాయి. ఛేదనలో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్లు కోల్పోయి 118పరుగులే చేయగల్గింది. ముర్షిదా ఖాతూన్(30), షోమా అక్తర్(31) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఇడెన్ కార్సన్‌కు మూడు, హన్నాకు రెండు, తహుహు, కెర్ర్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సూజీ బేట్స్‌కు లభించింది.
టి20 ప్రపంచకప్‌లో నేడు..
ఇండియా × ఇంగ్లాండ్(సా.6.30గం||లకు)
దక్షిణాఫ్రికా × ఆస్ట్రేలియా(రా.10.30గం||లకు)










