దుబాయ్ ఓపెన్ తొలిరౌండ్‌లోనే ఓటమి
దుబాయ్: సానియా మీర్జా కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ ఓటమితో ముగించింది. మంగళవారం జరిగిన దుబారు ఓపెన్ మహిళల డబుల్స్ తొలిరౌండ్ పోటీలో సానియాాకీస్ జోడీ 4-6, 0-6తో కుడెర్మటోవాాసంసనోవా జోడీ చేతిలో వరుససెట్లలో పరాజయాన్ని చవిచూసారు. దుబాయ్ ఓపెన్ అనంతరం టెన్నిస్ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సానియా తాజా ఓటమితో మళ్లీ టెన్నిస్ కోర్టులో కనబడకపోవచ్చు. 2003లో ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అడుగిడిన 36ఏళ్ల సానియా.. ఆరు డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుపొందగా.. అందులో గెలిచిన మూడు మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలిసి సాధించడం విశేషం. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో మహేశ్ భూపతితో కలిసి 2009(ఆస్ట్రేలియన్ ఓపెన్), 2012(ఫ్రెంచ్ ఓపెన్) గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సాధించింది. అలాగే యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను బ్రూనో సొరెస్‌తో కలిసి చేజిక్కించుకుంది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.










