May 25,2023 09:26

హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో రూ.2 కోట్ల విలువైన బంగరాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. మధ్య ప్రదేశ్‌కు చెందిన నిందితుడు 686 గ్రాముల బంగరాన్ని పేస్టుగా మార్చి పొట్టలో దాచి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. స్క్రీనింగ్‌ పరిక్ష ద్వారా బంగరాన్ని కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. నిందితుడి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 24 గంటలు గడవక ముందే మరోసారి బంగారం పట్టుబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.