Feb 20,2023 21:48

కైరో: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ పోటీల్లో భారత్‌కు తొలిరోజు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. మిక్స్‌డ్‌ ఎయిర్‌ పిస్టల్‌, మిక్స్‌డ్‌ ఎయిర్‌ రైఫిల్‌ విభాగాల్లో ఒక్కో స్వర్ణ పతకం దక్కింది. సోమవారం జరిగిన 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు ఈ పతకాలు దక్కాయి. నితిన్‌రాజ్‌-రుద్రాక్షలతో కూడిన మిక్స్‌డ్‌ బృందం 635.8పాయింట్లతో పోడియంలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక స్వర్ణ పతక పోటీలో భారతజోడీ హంగేరీకి చెందిన ఈస్టర్‌ డేనీస్‌-ఇస్టవాన్‌ పెనీలపై 16-6పాయింట్లతో గెలిచారు. భారత్‌కే చెందిన రీథమ్‌ సంఘ్వాన్‌-వరుణ్‌ థోమర్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో(583-17) అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతక పోటీలో 16-10తో సెర్బియా బృందంపై విజయం సాధించి రెండో స్వర్ణ పతకాన్ని ఖాయం చేసింది.