- ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్
న్యూఢిల్లీ : ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ మిక్స్‌డ్ ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బకర్, సరభ్‌జ్యోత్ సింగ్ జోడీకు స్వర్ణ పతకం లభించింది. తుగ్లకాబాద్‌లోని కర్నే సింగ్ రేంజ్ స్టేడియంలో బుధవారం జరిగిన మిక్స్‌డ్ పిస్టల్ విభాగంలో మను, సరబ్ జోడీ 16-2పాయింట్ల తేడాతో వరుణ్ దూబే-విభూతి భాటియాలపై విజయం సాధించారు. దీంతో క్వాలిఫికేషన్ విభాగంలో టాపర్స్‌గా నిలిచారు. వీరిద్దరూ ఛండీగడ్‌లోని పంజాబ్ యూనివర్శిటీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఈ ఏడాది జాతీయ, అంతర్జాతీయ పోటీలున్న నేపథ్యంలో తీవ్ర పోటీ ఎదురైనప్పటికీ ఈ జోడీ అద్భుత విజయాన్ని అందుకొంది. ఈ విభాగంలోనే హర్దీప్ సింగ్-సిఖా నర్వాల్‌కు కాంస్య పతకం దక్కింది. వీరు కాంస్య పతక పోటీలో 4-12, 14-12తో అమన్‌దీప్ సింగ్-ప్రదీప్ కౌర్ సిధూలపై గెలిచారు. ఇక మిక్స్‌డ్ స్కీట్ ఈవెంట్‌లో పంజాబ్ యూనివర్శిటీకి చెందిన పరినాజ్ ధలివాల్-ప్రభ్ ప్రతాప్ చాహల్ 31-29తో ఛిన్నా-సుఖ్బీర్‌లపై విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు.










