Jan 28,2023 10:00
  • ఐసిసి అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌

జొహనెస్‌బర్గ్‌ : అమ్మాయిలకు ఎదురులేదు. సమిష్టి ప్రదర్శన, ఏకపక్ష విజయాలతో ఐసిసి మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియా అండర్‌-19 జట్టు ఫైనల్లోకి చేరుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ అండర్‌-19 అమ్మాయిలపై షెఫాలీ వర్మ సేన అదిరే విజయం నమోదు చేసింది. 108 పరుగుల లక్ష్యాన్ని మరో 34 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన భారత్‌ అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌ టైటిల్‌ కోసం పోటీపడనుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ అండర్‌-19 స్పిన్నర్‌ పర్శవి చోప్రా (3/20) మాయకు 107/9 పరుగులే చేసింది. ప్లిమర్‌ (35), ఇసబెల్ల (26) రాణించటంతో కివీస్‌ వంద పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 14.2 ఓవర్లలోనే ఊదేసింది. ఓపెనర్‌ శ్వేత షెరావత్‌ (61 నాటౌట్‌, 45 బంతుల్లో 10 ఫోర్లు) ధనాధన్‌ అర్ధ సెంచరీతో దంచికొట్టింది. సౌమ్య తివారి (22) రాణించింది. 3 వికెట్లతో మాయ చేసిన పర్శవి చోప్రా 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు అందుకుంది.