- ముంబయి ఇండియన్స్‌పై 55 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలుపు
అహ్మదాబాద్ : ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-16లో గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. ముంబయి ఇండియన్స్‌తో మంగళవారం జరిగిన పోటీలో గుజరాత్ జట్టు 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీస్కోర్ నమోదు చేయగా.. ఛేదనలో ముంబయి జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 9వికెట్ల కోల్పోయి 152పరుగులే చేయగల్గింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్‌కు సీనియర్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(4) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(56) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా(13), విజరు శంకర్(19) నిరాశపరిచినా.. చివర్లో డేవిడ్ మిల్లర్(46), మనోహర్(42) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. మనోహర్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేస్తే.. డేవిడ్ మిల్లర్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు రాబట్టాడు. ఇక, రాహుల్ తెవాటియా కేవలం 5బంతుల్లో 3సిక్సర్లు కొట్టి 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముంబయి ఫీల్డింగ్ పేలవంగా సాగింది. పలు క్యాచ్‌లు జారవిడవడం గుజరాత్ టైటాన్స్‌కు కలిసొచ్చింది. పియూష్ చావ్లాకు రెండు, అర్జున్ టెండూల్కర్, బెహ్రెన్‌డార్ఫ్, మెరిడిత్‌కు, కార్తికేయకు ఒక్కో వికెట్ దక్కాయి. ఛేదనలో ముంబయి గ్రీన్(33), సూర్యకుమార్(23), వథేరా(40) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ముంబయి జట్టు 15ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 112పరుగులు చేసి లక్ష్యాన్ని దూరంగా నిలిచింది. నూర్ అహ్మద్‌కు మూడు, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాకు ఒక్కో వికెట్ దక్కాయి. ఈ గెలుపుతో గుజరాత్ జట్టు 10పాయింట్లతో రెండోస్థానానికి ఎగబాకింది.
స్కోర్‌బోర్డు..
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: వృద్ధిమాన్ సాహా (సి)ఇషాన్ కిషన్ (బి)అర్జున్ టెండూల్కర్ 4, శుభ్‌మన్ గిల్ (సి)సూర్యకుమార్ (బి)కార్తికేయ 56, హార్దిక్ పాండ్యా (సి)సూర్యకుమార్ (బి)చావ్లా 13, విజరు శంకర్ (సి)టిమ్ డేవిడ్ (బి)చావ్లా 19, డేవిడ్ మిల్లర్ (సి)సూర్యకుమార్ (బి)బెహ్రెన్ డార్ఫ్ 46, మనోహర్ (సి)బెహ్రెన్‌డార్ఫ్ (బి)మెరిడిత్ 42, తెవాటియా (నాటౌట్) 20, రషీద్ ఖాన్ (నాటౌట్) 2, అదనం 5. (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 207పరుగులు. వికెట్ల పతనం: 1/12, 2/50, 3/91, 4/101, 5/172, 6/205 బౌలింగ్: అర్జున్ టెండ్కూర్ 2-0-9-1, బెహ్రెన్‌డార్ఫ్ 4-0-37-1, మెరిడిత్ 4-0-49-1, గ్రీన్ 2-0-39-0, చావ్లా 4-0-34-2, కార్తికేయ 4-0-39-1,










