Jan 05,2023 21:07

న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ కొత్తగా ఎఫ్‌ సీరిస్‌ స్మార్ట్‌ఫోన్లలో గెలాక్సీ ఎఫ్‌04ను విడుదల చేసింది. భారత్‌లో దీని ప్రారంభ ధరను రూ.9,499గా నిర్ణయించింది. రెండు రంగుల్లో లభించే ఈ ఫోన్‌ జనవరి 12 నుంచి ఆన్‌లైన్‌లో లభ్యమవుతుందని తెలిపింది. 13 ఎంపి, 2ఎంపి వెనుక కెమెరాతో పాటు 5ఎంపి సెల్ఫీ కెమెరాను అమర్చింది.