ప్రజాశక్తి-అమరావతి : ఈ నెల 29న విజయవాడలో వైఎస్‌ఆర్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు సీఎంవో తెలిపింది. శుక్రవారం ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెళ్తారు. అనంతరం గ్రౌండ్‌లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం నిధులు విడుదల చేసి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారని సీఎంవో తెలిపింది.










