Apr 14,2023 22:15

క్వార్టర్స్‌లో ఓడిన మెద్వదెవ్‌, సిట్సిపాస్‌
మోంటేకార్లో ఓపెన్‌

మొనాకో: మోంటేకార్లో ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ సెమీఫైనల్లోకి రుబ్లేవ్‌(రష్యా), ఫ్రిట్జ్‌(అమెరికా) ప్రవేశించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఆండీ రుబ్లేవ్‌ 6-1, 7-6(7-5)తో స్ట్రఫ్‌(జర్మనీ)పై వరుససెట్లలో నెగ్గాడు. మరో పోటీలో రూనే(నార్వే) 6-3, 6-4తో టాప్‌సీడ్‌ డానియేల్‌ మెద్వదేవ్‌(రష్యా)పై సంచలన విజయం సాధించాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో ఫ్రిట్జ్‌ 6-2, 6-4తో 2వ సీడ్‌ స్టెఫోనాస్‌ సిట్సిపాస్‌(గ్రీక్‌)పై గెలుపొందగా.. నాల్గో క్వార్టర్‌ఫైనల్లో సిన్నర్‌(పోలండ్‌) 6-32, 6-4తో సహచర ఆటగాడు మసెట్టిని చిత్తుచేసి సెమీస్‌కు చేరాడు. శనివారం జరిగే సెమీస్‌లో హోల్జర్‌ రూనేామసెట్టి మధ్య, ఆండీ రుబ్లేవ్‌-టేలర్‌ ఫ్రిట్జ్‌మధ్య పోటీ జరగనుంది. ప్రి క్వార్టర్స్‌లో మసెట్టి టాప్‌సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌పై 4-6, 7-5, 6-4 తేడాతో ఓడించాడు.