పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్, ఇగా స్వైటెక్(పోలెండ్), 4వ సీడ్, కజకిస్తాన్‌కు చెందిన ఎలేనా రైబకినా జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం జరిగిన రెండోరౌండ్ పోటీల్లో ఇగా స్వైటెక్ 6-4, 6-0 తేడాతో అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ లియావోపై, రైబకినా 6-3, 6-3తో చెక్ రిపబ్లిక్‌కు చెందిన నొస్కోవాపై విజయం సాధించాడు. మరో పోటీలో 22వ సీడ్ వేకిక్(క్రొయేషియా) 6-4, 4-6, 1-6తో అన్‌సీడెడ్ పెరా(అమెరికా) చేతిలో, 20వ సీడ్ కీస్(అమెరికా) 2-6, 6-4, 4-6తో సహచర క్రీడాకారిణి కయియా డే చేతిలో ఓటమిపాలై టోర్నీనుంచి నిష్క్రమించారు. మరో పోటీలో 23వ సీడ్ అలెగ్సాండ్రోవా(రష్యా) 6-2, 6-0తో ఫ్రెండ్‌సెమ్(జర్మనీ)పై విజయం సాధించింది.
- రూఢ్, నిషియోకా ముందుకు..
పురుషుల సింగిల్స్‌లో 4వ సీడ్, నార్వేకు చెందిన కాస్పర్ రూడ్, 27వ సీడ్ జపాన్‌కు చెందిన నిషియోకో ప్రవేశించారు. రెండోరౌండ్‌లో రూఢ్ 6-3, 6-2, 4-6, 7-5తో జెప్పేరి(ఇటలీ)పై, నిషియోకా 4-6, 6-2, 7-5, 6-4తో పర్సెల్(ఆస్ట్రేలియా)పై గెలిచారు. మరో పోటీలో 6వ సీడ్ రూనే(డెన్మార్క్)కు రెండోరౌండ్‌లో వాకోవర్ లభించింది. ఫ్రాన్స్‌కు చెందిన మోన్‌ఫీల్ గాయం కారణంగా రెండోరౌండ్ మ్యాచ్ ఆడకుండానే నిష్క్రమించాడు. దీంతో రూనే మూడోరౌండ్‌కు చేరుకున్నాడు.










