పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో 2వ సీడ్, అన్స్ జబీర్(ట్యునీషియా) శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో జబీర్ 6-4, 6-1తో బ్రూంజోటీ(ఫ్రాన్స్)పై విజయం సాధించింది. మరో పోటీలో 6వ సీడ్ కోకా గాఫ్(అమెరికా) 3-6, 6-1, 6-2తో స్పెయిన్‌కు చెందిన మసరోవాపై చెమటోడ్చి నెగ్గింది. మరో పోటీలో డోటిన్(ఫ్రాన్స్) 0-6, 6-2, 6-1తో సహచర క్రీడాకారిణి జెనెక్‌జెవిక్‌పై పోరాడి గెలిచి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లింది.
- రూఢ్, జ్వెరేవ్ ముందుకు..
పురుషుల సింగిల్స్‌లో నార్వేకు చెందిన కాస్పర్ రూఢ్, జర్మనీకి చెందిన ఆండీ జ్వెరేవ్ రెండోరౌండ్‌లోకి ప్రవేశించారు. 22వ సీడ్ జ్వెరేవ్ 7-6(8-6), 7-6(7-5), 6-1తో హర్రీస్(దక్షిణాఫ్రికా)పై, 4వ సీడ్ రూఢ్(నార్వే) 6-4, 6-3, 6-2తో క్వాలిఫయర్ యేమర్(స్వీడన్)పై సునాయాసంగా గెలుపొందారు. ఇతర పోటీల్లో 27వ సీడ్, జపాన్‌కు చెందిన నిషోకా 1-6, 3-6, 6-4, 6-3, 6-3తో వోల్ఫ్(అమెరికా)పై ఐదుసెట్ల హోరాహోరీ పోరులో నెగ్గాడు.










