న్యూఢిల్లీ : వచ్చే ఏడాదిలో మరో రెండు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) జరగనుందని వాణిజ్య శాఖ మంత్రి పియూస్ గోయల్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి బ్రిటన్, యూరోపియన్ యూనియన్, కెనడా దేశాలతో చర్చలు జరుగుతున్నాయన్నారు. 2023లో కనీసం రెండు దేశాలతో ఎఫ్‌టిఎ జరగనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌ా ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సహాకర, వాణిజ్య ఒప్పందం జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.










