Apr 27,2023 22:01

కోల్‌కతా: ఆసియా క్రీడలకు మహిళా గోల్ఫర్లు ప్రణవి, అవని ప్రశాంత్‌, అదితి అశోక్‌ అర్హత సాధించారు. రాయల్‌ కోల్‌కతా గోల్ఫ్‌ క్లబ్‌లో జరిగిన పోటీల అనంతరం వీరు ఆసియా క్రీడలకు క్వాలిఫై అయ్యారు. ఫైనల్‌ రౌండ్‌ అనంతరం ఖలీన్‌ జోషీ కూడా ఆసియా క్రీడలకు ఎంపికైంది. 2016 ఒలింపిక్స్‌కు ఛవ్రాసియా ప్రాతినిధ్యం వహించగా.. ప్రణవి, అతిథి అశోక్‌ టోక్యో ఒలింపిక్స్‌లో ఆడారు. ఇక పురుషుల విభాగంలో అనిర్బన్‌ లాహిరి, శుభాంకర్‌ శర్మల జట్టు ఆసియా క్రీడలకు బెర్త్‌ సంపాదించింది. ఇక లాహిరి, ఉదయన్‌ మానే 2016, 2020 ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించారు.