Oct 14,2023 14:52

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కి రాజీనామా చేసిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటికి బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వెళ్లారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి కేటీఆర్‌.. హైదరాబాద్‌లోని పొన్నాల నివాసానికి వెళ్లారు. శుక్రవారం కాంగ్రెస్‌కి పొన్నాల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను బిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించేందుకు కేటీఆర్‌ వెళ్లినట్టు సమాచారం. పొన్నాల నివాసం వద్దకు ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జనగామ గడ్డ.. పొన్నాల అడ్డా అంటూ నినాదాలు చేశారు. శుక్రవారం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. పొన్నాల బిఆర్‌ఎస్‌లోకి వస్తానంటే ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.