ప్రజాశక్తి-గొల్లపూడి: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎలాంటి నిరసనలు చేపట్టకుండా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు గృహనిర్భంధం చేశారు. గొల్లపూడిలోని ఉమా ఇంటిని ఉదయం 8 గంటలకే చేరుకున్న పోలీసులు.. ఆయనను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు తనను గృహనిర్భంధం చేయడంపై ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.










