విజయవాడ: విజయవాడ వైసిపిలో దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు 'త్రీ ఇడియట్స్'లా ఉన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. వెల్లంపల్లి శ్రీనివాస్ దుర్గగుడిలో లింగాలు మింగాడు కాబట్టే మంత్రి పదవి పోయిందని విమర్శించారు.శనివారం విజయవాడలో జరిగిన లోకేష్ పాదయాత్ర చూసి వైసిపి నాయకులకు మతిపోయిందని ఎద్దేవా చేశారు. వందమంది జగన్‌లు వచ్చినా చంద్రబాబు విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. వైఎస్‌కు భయపడి కొడాలి నాని, జగన్‌కు భయపడి దేవినేని అవినాష్ పారిపోయారని దుయ్యబట్టారు. వచ్చే ఆరు నెలల్లో వైసిపి అడ్రస్ గల్లంతవడం ఖాయమని, సీనియర్ నేతలు బండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా హెచ్చరించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ .. లోకేశ్‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు.










