ప్రజాశక్తి-గోపాలపురం(తూర్పుగోదావరి) : పోలవరం ప్రాజెక్టు పర్యాటనకు వెళుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే వీరాంజనేయులులను గోపాలపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టిడిపి నాయకులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గోపాలపురం ఎస్‌ఐ రామకృష్ణ, డిఎస్‌పి టిడిపి శ్రేణులను అడ్డుకొని గోపాలపురం పోలీస్ స్టేషన్ తరలించారు. దేవినేని ఉమామహేశ్వరరావును పోలవరం పరిధిలో అడ్డుకొని బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ తరలించారు. మరోవైపు టిడిపి నేతలు పోలవరం వస్తున్నారనే సమాచారంతో అడ్డుకోవడానికి పోలవరం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.












