Jul 29,2023 14:32

అమరావతి: రాయలసీమ ప్రాజెక్టులను ఆయన నాశనం చేసిన ఘనత సిఎం జగన్మోహన్‌రెడ్డిదేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. రాయలసీమ కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై టిడిపి అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. ముఖ్యమంత్రి ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. టిడిపి ప్రభుత్వం పూర్తి చేసిన సంఘం, నెల్లూరు బ్యారేజీలకు తమ పేర్లు పెట్టుకున్నారని విమర్శించారు. ప్రాజెక్టులకు పేర్లు మార్చడం తప్ప వైసిపి ఉద్ధరించింది ఏమైనా ఉందా? అని మండిపడ్డారు. టిడిపి ఐదేళ్ల పాలనలో సాగునీటి విషయంలో ఏం చేశామన్న చరిత్ర తమ దగ్గర ఉందన్నారు