చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మార్క్‌కు చేరుకోవడానికి విరాట్ ఎక్కువగా బంతులను వృథా చేశాడని కామెంటేటర్ సైమన్ డౌల్ విమర్శించాడు. 42 నుంచి 50 పరుగుల మార్క్‌కు చేరుకొనేందుకు పది బంతులను తీసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా విరాట్‌పై డౌల్ చేసిన విమర్శలను పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కొట్టిపడేశాడు. డౌల్ చెత్త వ్యాఖ్యలు చేశాడంటూ విమర్శించాడు. 'డౌల్ పాకిస్థాన్ మ్యాచ్ లకు కామెంటరీ చేస్తున్నప్పుడు కూడా బాబర్ ఆజమ్ విషయంలో ఇలాంటి పదాలు ఉపయోగించాడు. స్పిన్నర్ బిష్ణోరు బౌలింగ్‌లో మూడు నాలుగు సార్లు షాట్లు కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ, షాట్లు కనెక్ట్ కాలేదు. ఇది ఆటలో ఓ భాగం. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు సాధించాడు. తను ఇంకా ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. డౌల్ చెత్త వాగుడు వాగాడు' అంటూ బట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.










